: ఐసీసీ పగ్గాలు చేపట్టనున్న బీసీసీఐ అధ్యక్షుడు
భారీ సంస్కరణలకు ఐసీసీ బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కంట్రోల్ కమిటీపై భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల ఆధిపత్యం కొనసాగనుంది. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసన్ తాజా మార్పులతో ఐసీసీ అధ్యక్షుడిగా ఈ ఏడాది మధ్యలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఐసీసీలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ రోజు సింగపూర్ లో జరిగిన సమావేశంలో పది మంది సభ్యులకు గాను ఎనిమిది మంది సభ్యులు ఆమోదం తెలిపారు. శ్రీలంక, పాకిస్థాన్ మాత్రం వ్యతిరేకతతో సమావేశానికి దూరంగా ఉన్నాయి. శ్రీలంక, పాకిస్థాన్ సభ్యులను కూడా ఒప్పించి ఏకగ్రీవంగా తాజా సంస్కరణలకు ఆమోదముద్ర వేస్తామని ఐసీసీ అధ్యక్షుడు అలన్ ఇజాక్ చెప్పారు.