: వీటికి ఓకే అంటే వృద్ధులకు నిశ్చింతే!
దేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. 2001 లెక్కల ప్రకారం దేశ జనాభాలో వృద్ధులు 7.5శాతం ఉండగా. ఇది 2026 నాటికి 12.4శాతానికి చేరుకుంటుందని అంచనా. ఐక్యరాజ్య సమితి కూడా భారత్ లో వృద్ధుల జనాభా 2050 నాటికి రెట్టింపు అవుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వృద్ధుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను సామాజిక న్యాయం కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
పదవీ విమరణ వయస్సును 65ఏళ్లకు పెంచాలన్నది వీటలో ముఖ్యమైనది. జీవిత కాలం పెరిగినందున ఇది తప్పనిసరని పేర్కొంది. అంతేకాదు, పదవీ విరమణ అనంతరం కూడా వారు పనిచేసుకునేందుకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరింది. అలాగే వారి కోసం అన్ని రాష్ట్రాలలో అత్యాధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. వృద్ధుల పెన్షన్ ను 1,000 రూపాయలు చేయాలని కోరింది.