: బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి రూపాయికి లెక్క చెబుతాం: నరేంద్ర మోడీ
భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మణిపూర్ లోని కాంగ్రెస్ పరిపాలన అవినీతిలో అన్ని రికార్డులను బద్దలుకొట్టిందని మోడీ అన్నారు. విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో ఈశాన్య రాష్ట్రాలు నలిగిపోతున్నాయని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే దేశంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో పథకాలు కాగితాల మీద ఉంటే.. నిధులు మాత్రం కాంగ్రెస్ నేతల లాకర్లలోకి వెళ్తున్నాయని ఆయన విమర్శించారు. 60 ఏళ్లు కాంగ్రెస్ వాళ్లు పాలించారు.. బీజేపీకి 60 నెలలు అధికారమివ్వండని ఆయన ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి రూపాయికి లెక్క చెబుతామని మోడీ స్పష్టం చేశారు.