: పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపకండి: ఢిల్లీలో టీవాదుల ధర్నా
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఢిల్లీలో తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేస్తూ, ధర్నా చేపట్టారు. వీరికి టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ నేత వినోద్, ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవిప్రసాద్ లు సంఘీభావం తెలిపారు.