: ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు తమ భార్యల కంటే చిన్నోళ్లు


భార్య కన్నా భర్త పెద్దవాడై వుండాలన్నది నిన్నటి మాట. ఇప్పుడా తేడా లేదు... ఇంకా చెప్పాలంటే, భర్తల కన్నా భార్యలే వయసులో రెండు మూడేళ్ళు పెద్దవుతున్నారు. ఈ బాలీవుడ్ జంటలను చూడండి!అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యల జంట గురించి ముందుగా చెప్పుకోవాలి. సల్మాన్, వివేక్ ఒబేరాయ్ లతో తెగతెంపుల తర్వాత ఐశ్వర్యకు అభిషేక్ తో ముడిపడింది. ఐశ్వర్య కంటే అభిషేక్ రెండేళ్లు చిన్న. ఐశ్వర్యకు 40 అయితే, అభిషేక్ కు 38ఏళ్లే. అయినా ఈ జంట అన్యోన్యంగానే కలసి సాగుతోంది.

ఒకరు వ్యాపారవేత్త. మరొకరు నాజూకైన సుందరి. ప్రేమలో పడ్డారు. పెళ్లితో శుభం పలికారు. వారే రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి. శిల్పాకు 38ఏళ్లు కాగా, కుంద్రా ఆమె కంటే మూడేళ్లు చిన్న. బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్, ఎడిటర్ శిరీష్ కుమార్ జంట కూడా ఇదే కేటగిరిలోకి వస్తుంది. వీరిద్దరూ మే హూన్ న చిత్ర సెట్టింగ్స్ లో పరిచయమయ్యారు. శిరీష్ ప్రతిభ ఫరా మనసును ఆకట్టుకుంది. తర్వాత ప్రేమకు దారితీసింది. ఫరా శిరీష్ కంటే ఎనిమిదేళ్లు పెద్ద. అయినా వారికి అడ్డు అనిపించలేదు. పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

మరో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ లవ్ స్టోరీ కూడా సేమ్ టు సేమ్. ఫర్హాన్ అధునను వివాహం చేసుకున్నాడు. ఆమె ఫర్హాన్ కంటే ఆరేళ్లు పెద్ద. ఇప్పటికీ వారి ప్రేమ వికసిస్తూనే ఉంది. అర్జున్, మెహ్రాల జంట మధ్య రెండేళ్లు తేడా ఉంది.

  • Loading...

More Telugu News