: నేటి నుంచి హైదరాబాదులో విద్యుత్ కోతలు
ఇంతకాలం జిల్లాలకు, గ్రామీణ ప్రాంతాలకు పరిమితమైన విద్యుత్ కోతలు హైదరాబాద్ నగరాన్ని తాకాయి. ఈ రోజు నుంచి నగరంలో రోజుకు రెండు గంటల పాటు విద్యుత్ కోతను విధించాలని సీపీడీసీఎల్ నిర్ణయించింది. ఈ కోత రెండు విడతలుగా ఉంటుంది. రబీ సీజన్ కారణంగా విద్యుత్ కు డిమాండ్ భారీగా పెరిగిందని... డిస్కం పరిధిలో రోజూ 20 నుంచి 30 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడుతోందని... గ్రిడ్ భద్రత రీత్యా విద్యుత్ కోత విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని సీపీడీసీఎల్ అధికారి తెలిపారు.