: ఎన్నికలపై దృష్టి సారించండి: నేతలకు చంద్రబాబు ఆదేశం
ఎన్నికలకు సమయం తక్కువగా ఉందని... పార్టీ నేతలంతా ఎన్నికలకు సన్నద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు తన శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని... ప్రస్తుత పరిస్థితుల్లో మోడీకి దీటుగా ఎవరూ లేరని చెప్పారు. బీజేపీతో పొత్తు నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సాయంత్రం ఇరు ప్రాంతాల నేతలతో చంద్రబాబు విడివిడిగా భేటీ కానున్నారు.