: అనూహ్య కేసులో నిందితుల రేఖాచిత్రాలు విడుదల
మచిలీపట్నం వాసి, 23 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు నిందితుల రేఖాచిత్రాలను విడుదల చేశారు. అనూహ్యను హత్య చేసినట్లుగా భావిస్తున్న అనుమానితుల రేఖా చిత్రాలను తీసుకుని పోలీసులు మద్యం విక్రేతలు, బార్ అండ్ రెస్టారెంట్ లలో విచారిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో అనూహ్య రక్త నమూనాలకు నిర్వహించిన పరీక్షల్లో మద్యం, మత్తుపదార్థాల ఆనవాళ్లు కనిపించాయి. ముంబై లోక్ మాన్య తిలక్ టెర్మినల్ పరిసర ప్రాంతాల్లో మద్యం విక్రేతలు, బార్ యాజమానుల నుంచి అనుమానితుల రేఖా చిత్రాలతో నిందితుల కోసం వేటను ముమ్మరం చేశారు. ఎల్ టీటీలో అనూహ్యతో పాటు ఫ్లాట్ ఫారమ్ పై కనిపిస్తున్న యువకుడు, అనూహ్యను కలవడానికి అరగంట ముందు అక్కడే వేచి ఉన్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపిస్తోంది. అతడి చేతిలో ఉన్నది మద్యం సీసానేనని పోలీసులు నిర్థారించారు. ఆ సమయంలో అతడు మత్తులోనే ఉన్నట్లు సీసీ కెమెరా ఫుటేజిలో వెల్లడైంది.