: వివాదంలో ప్రభుదేవా తాజా హిందీ చిత్రం టైటిల్
కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా తాజాగా హిందీలో రూపొందిస్తున్న 'యాక్షన్ జాక్సన్' టైటిల్ కు సమస్య లొచ్చిపడ్డాయి. 1988లో హాలీవుడ్ లో కార్ల్ వెథర్స్, షరాన్ స్టోన్ నటించిన ఓ చిత్రం ఇదే టైటిల్ (యాక్షన్ జాక్సన్) తో విడుదలయింది. దాంతో, ఆ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ బాలీవుడ్ లో ప్రభు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న బాబా ఆర్ట్స్ లిమిటెడ్ ప్రొడక్షన్, ఎరోస్ ఇంటర్నేషనల్ కు నోటీసు పంపింది. 48 గంటల్లోగా తమ టైటిల్ ను మార్చుకోవాలని హెచ్చరించింది. అయితే, తమ చిత్రం ఇప్పటికే 70 శాతం పూర్తయిందని, ఇప్పుడు ఆ నిర్మాతలు స్పదించడమేంటని బాబా ఆర్ట్స్ లిమిటెడ్ ప్రొడక్షన్ నిర్మాత తన్వానీ ప్రశ్నించారు. టైటిల్ పై ముందుగానే స్పందించాల్సిందన్నారు.