: బిల్లు పాస్ చేయాలన్నదే మా లక్ష్యం: కమల్ నాథ్
తెలంగాణ బిల్లు పాస్ చేయాలన్నదే తమ లక్ష్యమని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అన్నారు. బిల్లుపై ఓటింగ్ ద్వారానే విభజన సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కాబట్టి, పార్లమెంట్ సమావేశాలకు సభ్యులు సహకరించాలని కోరారు. ప్రధానంగా సీమాంధ్ర, తెలంగాణ ఎంపీలు ఇకనైనా ఆందోళనలు ఆపాలన్నారు.