: రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానంటున్న సినీ నటి


అభినయం కంటే అందచందాలతో ఎక్కువగా ఆకట్లుకున్న సినీ నటి, కన్నడ ముద్దుగుమ్మ రక్షిత... తన అంతిమ గమ్యం రాజకీయాలే అంటోంది. రానున్న ఎన్నికల్లో జేడీ (ఎస్) అభ్యర్థిగా బెంగళూరు నుంచి పోటీ చేస్తానని తెలిపింది. నిన్న కుటుంబసమేతంగా ఆమె శ్రీ కాళహస్తీశ్వరాలయానికి విచ్చేసి, ప్రత్యేక రాహుకేతువుల పూజలు చేయించుకుంది. అనంతరం మాట్లాడుతూ, వివాహం అయిన తర్వాత సినిమాల్లో నటించలేదని... రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని చెప్పింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మరో కన్నడ నటి రమ్య ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News