: మార్కెట్లోకి మరో చిన్న కారును విడుదల చేసిన మారుతి
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి మరో చిన్న కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 'సెలెరియో' పేరిట విడుదల చేసిన ఈ కారు ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.9 లక్షల నుంచి రూ.4.96 లక్షల మధ్య ఉంటుందని మారుతి వర్గాలు తెలిపాయి. ఈ ధర మాన్యువల్ ట్రాన్స్ మిషన్ మోడళ్ళకు వర్తిస్తుంది. ఇక ఆటో గేర్ షిఫ్టింగ్ మోడళ్ళ ధర రూ.4.29 లక్షల నుంచి రూ.4.59 లక్షల (ఢిల్లీ ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. 'సెలెరియో' లీటర్ కు 23.1 కిమీ మైలేజి ఇస్తుందని మారుతి ప్రకటించింది.