: ఎల్లుండి గుజరాత్ లో పర్యటించనున్న రాహుల్


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం గుజరాత్ పర్యటనకు వెళ్ళనున్నారు. 1928లో సర్దార్ వల్లభాయ్ పటేల్ రైతులతో కలిసి సత్యాగ్రహ ఉద్యమానికి నాంది పలికిన ప్రాంతం బర్డౌలీని ఆయన సందర్శిస్తారు. అదేరోజు సాయంత్రం రాహుల్ అక్కడి మురారీ బాపు మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు రాహుల్ గాంధీ కార్యాలయ వర్గాలు వివరాలు వెల్లడించాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి మధ్య సంకుల సమరం తప్పదని భావిస్తున్న నేపథ్యంలో యువనేత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News