: రాష్ట్రపతితో టీడీపీ సీమాంధ్ర ఎంపీల భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో టీడీపీ సీమాంధ్ర ఎంపీలు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లులో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను సీమాంధ్ర టీడీపీ ఎంపీలు రాష్ట్రపతికి వివరించనున్నారు. రాష్ట్ర విభజనలో కేంద్రం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని, సంప్రదాయాలను పాటించడం లేదని రాష్ట్రపతికి తెలుపనున్నారు. ఆర్టికల్ 3 పేరిట రాష్ట్ర అసెంబ్లీ హక్కులను కేంద్రం కాలరాస్తోందని రాష్ట్రపతికి సూచించనున్నారు.