: అమెరికా మిలిటరీ కుక్కను పట్టుకున్న తాలిబాన్లు
ఇటీవల కాలంలో తాలిబాన్లపై అమెరికా సేనలదే పైచేయిగా నిలుస్తోంది. కారణం, మానవరహిత విమానాలు డ్రోన్ లే! కొంతకాలంగా అమెరికా సైన్యానికి చెందిన ఏ ఒక్క సైనికుడినీ ఇబ్బంది పెట్టలేకపోయిన తాలిబాన్లు.. చివరికి వారికి చెందిన ఓ కుక్కను మాత్రం పట్టుకోగలిగారు. అంతేగాకుండా దాంతో సగర్వంగా ఫొటోలు కూడా తీయించుకున్నారు. అంతేగాకుండా వీడియో కెమెరా ముందు దాన్ని కాసేపు పెరేడ్ చేయించారు. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ లో గత డిసెంబర్లో పట్టుకున్నారట దాన్ని. ఇన్నాళ్ళకు దానికి సంబంధించిన ఫుటేజి విడుదల చేశారు. ఇంతకీ కుక్క పేరు ఏంటో తెలుసా.. 'కల్నల్' అట. దాని మెడలో జీపీఎస్ పరికరంతో పాటు ఓ కెమెరా కూడా ఉందని తాలిబాన్లు చెప్పారు.