: 'సిల్క్' జీవితంపై అధ్యయనం
దక్షిణాది సినిమాల్లో శృంగార పాత్రలకు సరికొత్త భాష్యం చెప్పిన నిషా కళ్ళ సుందరి సిల్క్ స్మిత జీవితం ఇప్పుడో అధ్యయన వస్తువుగా మారింది. ఇటీవల బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటించిన 'డర్టీ పిక్చర్' తో స్మిత జీవిత విశేషాలపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.
దీంతో, ఆ సినిమాలో సిల్క్ పాత్రను సామాజిక, మానసిక కోణంలో అధ్యయనం చేయాలని టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నిశ్చయించింది. టాటా సంస్థ సామాజికవేత్తలు ఎంతో పరిశీలించిన మీదట 'డర్టీ పిక్చర్' లో విద్య పోషించిన పాత్ర అయితే అధ్యయనానికి సరిగ్గా సరిపోతుందని భావించారట.