: బార్ గాళ్స్ తో చిందులేసిన ఎమ్మెల్యే..!


శాసనసభ్యుడంటే.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాల్సివాడు.. ప్రజలకు జవాబుదారీగా, వారికి ప్రతినిధిగా మెలగాల్సినవాడు. కానీ, ఈ ఎమ్మెల్యే మాత్రం నీతిబాహ్యమైన పనులతో వార్తల్లోకెక్కాడు. ఓ పెళ్ళి వేడుకలో బార్ గాళ్స్ తో అసభ్యంగా చిందులేసి శాసనసభ్యుడి పదవికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు. వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ఎమ్మెల్యే చిత్తరంజన్ స్వరూప్ ఇటీవల ఓ వివాహానికి హాజరయ్యాడు. అక్కడ జరిగిన గానా భజానాలో అందమైన అతివలను చూస్తూనే ఈ ప్రజాప్రతినిధి రెచ్చిపోయాడు.

వెంటనే వేదికపైకెక్కి వారితో కలిసి అసభ్యకర రీతిలో నృత్యం చేయడమే గాకుండా, వారిపైకి కరెన్సీ నోట్లను విరజిమ్మాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే చవకబారు చేష్టలను ఇతర సమాజ్ వాదీ నేతలు కూడా కనులారా వీక్షించారట. ఈ ఉదంతం యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ చిక్కులు తెచ్చిపెడుతుందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పటికే మత ఘర్షణల కారణంగా ముజఫర్ నగర్ జిల్లాలో కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినాయకత్వం చిత్తరంజన్ చిందులను సీరియస్ గా తీసుకునే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News