: విభజన వద్దనే కోరుతున్నాం: సబ్బం హరి
కేంద్ర మంత్రులు వెళ్తున్న దారి సరైంది కాదని ఎంపీ సబ్బం హరి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రులు జీవోఎం చుట్టూ తిరుగుతూ ప్రాధేయపడిన సందర్భాలు ఉన్నాయని, అప్పుడు పట్టించుకోని జీవోఎం ఇప్పుడు పెద్ద మార్పులు చేస్తుందని భావించడం లేదని అన్నారు. కేంద్ర మంత్రులు చేస్తున్న డిమాండ్లు ప్రజలకు చెప్పుకునేందుకు పనికొస్తాయే తప్ప, వాటి వల్ల ఒనగూరే ప్రయోజనం ఏదీ లేదని అన్నారు. శాసనసభ పంపిన అభ్యంతరాలను చదివేందుకు కూడా సమయం లేని జీవోఎం, ఏవో అద్భుతాలు చేస్తుందని తాను భావించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని అన్నారు. కాంగ్రెస్ నేతలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని ఆయన మండిపడ్డారు.