: ఆర్ బీఐ, డీఎంకేల ప్రకటనలతో నష్టాల్లో ట్రేడయిన మార్కెట్లు


స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవి చూశాయి. ఆర్ బీఐ ద్రవ్య పరపతి విధానం, యూపీఏ నుంచి డీఎంకే వైదొలగుతున్నట్లు చేసిన ప్రకటన మార్కెట్లును అగాధంలోకి నెట్టాయి. ఉదయం నుంచి నష్టాల్లోనే ట్రేడ్ అయిన బీఎస్ఈ సెన్స్ క్స్ చివర్లో 285 పాయింట్లు నష్టపోయి 19,008 వద్ద ముగిసింది.

ఇక, ఎన్ఎస్ఈ నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 5,745 వద్ద ముగిసింది. గెయిల్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా ఇండియా, ఐటిసి లిమిటెడ్, మారుతీ సుజుకీ షేర్లు ఒక శాతంపైన లాభపడ్డాయి. బీహెచ్ఈఎల్, భారతీ ఎయిర్ టెల్, స్టెరిలైట్ ఇండియా, జిందాల్ స్టీల్ ప్లాంట్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు అత్యధికంగా 4 శాతం వరకు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News