: తేనెటీగలు మకరందాన్ని ఎలా గుర్తిస్తాయో తెలుసా?
తేనెటీగలు పువ్వుల్లో మకరందాన్ని తేనెగా మనకు అందిస్తున్నాయి. రోజంతా కష్టపడి చుక్క చుక్క మకరందాన్ని తాగి.. వచ్చి గూళ్లలో విడుదల చేస్తుంటాయి. మరి ఎన్నో పువ్వులు. అన్నింటిలోనూ మకరందం ఉండదు. పైగా, మంచి రుచి ఉన్న మకరందాన్నే అవి పట్టుకొస్తాయి. ఇంతకీ ఏ పువ్వులో మకరందం రుచి ఎలా ఉంటుందో వాటికెలా తెలుస్తుంది? దీనిపైనే ఫ్రాన్స్ లోని టౌలూస్ వర్సిటీ పరిశోధకులు పరిశోధన నిర్వహించారు. అవి పువ్వుపై వాలి కాలి గోళ్ల సాయంతో రుచిని పసిగట్టి తాగాలా? వద్దా? నిర్ణయించుకుంటాయని వీరు తేల్చారు. తేనెటీగల కాలి గోళ్లకు ఉప్పు, తీపి ద్రావకాలు రాసి, వాటి నాలికలను పరిశీలించగా ఇది తెలిసిందట. వందల సంఖ్యలో తేనెటీగలపై పరిశోధన చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు.