: తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ కు పుట్టగతులుండవు: ఎర్రబెల్లి
తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు హెచ్చరించారు. చంద్రబాబు సీమాంధ్ర ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు. ఒకవేళ టీబిల్లును వెనక్కి పంపాలని చంద్రబాబు చెబితే అది తప్పని అన్నారు. సీమాంధ్ర టీడీపీ నేతల చర్యలతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే తమపై విమర్శలు గుప్పిస్తోందని విమర్శించారు. ఈ నెల 8న టీటీడీపీ ఆధ్వర్యంలో మరోసారి బీజేపీ నేతలను కలసి తెలంగాణ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా కోరతామని తెలిపారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మాట్లాడారు.