: ప్రధానితో తెలంగాణ నేతల భేటీ.. రాష్ట్రపతిని కలిసిన సీఎం
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని విన్నవించుకున్నారు. మరోవైపు, జంతర్ మంతర్ వద్ద మౌనదీక్షను ముగించిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. సీఎం వెంట సీమాంధ్ర నేతలు కూడా ఉన్నారు. విభజన అసమంజసం అని వారు రాష్ట్రపతికి వివరించనున్నట్టు తెలుస్తోంది.