: తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని చెప్పారు: కోదండరాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని టీజేఏసీ కన్వీనర్ కోదండరాం మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు కట్టుబడే ఉన్నామని ప్రధాని మన్మోహన్ చెప్పారని... అలాగే బీజేపీ కూడా ఇచ్చిన మాట తప్పమని చెప్పిందని తెలిపారు. టీబిల్లుకు మద్దతు కోసం అన్ని పార్టీలను కలసి వారి మద్దతు కోరతామని చెప్పారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రస్తుత పరిస్థితుల్లో వెనకడుగు వేస్తే... రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని టీజీవో నేత శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.