: బీహార్ రిమాండ్ హోమ్ నుంచి 11 మంది జువనైల్ ఖైదీలు పరార్


బీహార్ లోని భోజ్ పురి జిల్లా ధన్ పుర్ గ్రామంలో ఉన్న రిమాండ్ హోమ్ నుంచి పదకొండు మంది బాల ఖైదీలు తప్పించుకున్నారు. సరస్వతి పూజ సందర్భంగా నిన్న (మంగళవారం) రిమాండ్ హోమ్ లో ఓ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఇదే అదునుగా భావించిన బాలురు గతరాత్రి ఓ గదిలోని గ్రిల్ ను తొలగించి పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన హోమ్ అధికారులు వెతకగా ముగ్గురు దొరికినట్లు ఎస్ హెచ్ ఓ బీకే సింగ్ చౌహన్ అనే వ్యక్తి చెప్పాడు. ఈ విషయంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News