: తెలంగాణ బిల్లు తేవొద్దని చెప్పాం: రాయపాటి


తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దని చెప్పామని ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మౌనదీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కేంద్రానికి సీమాంధ్ర ప్రజల ఆవేదన తెలియజెప్పేందుకే మౌనదీక్ష చేపట్టామని తెలిపారు. రాష్ట్ర విభజన అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, దానికి అందరూ ఒప్పుకోవాలని ఆయన సూచించారు. అధిష్ఠానం కదా అని ఇష్టానుసారం చేస్తామంటే జరిగే పర్యవసానాలు ఇలానే ఉంటాయని రాయపాటి అభిప్రాయపడ్డారు. బిల్లును అడ్డుకునేందుకు అధిష్ఠానాన్ని ధిక్కరించేందుకు సైతం ఎవరూ వెనుకాడడం లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News