: కిడ్నాప్ కేసులో యువకుడికి జీవిత ఖైదు


పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడికి స్థానిక కోర్టు జీవిత శిక్ష విధించింది. దాంతోపాటు రూ.5,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 2011లో మధ్యప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త గోకుల్ ప్రసాద్ శర్మ(45), అతని కుమారుడు అమీన్ ఖాన్ (24) ఓ పనికోసం పశ్చిమ బెంగాల్ వచ్చినప్పుడు, ఓ ముఠా వారిని కిడ్నాప్ చేసింది. వారిలో భాగమైన అబ్దుల్ మోమిన్ అనే యువకుడికి ఈ కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానించి అరెస్టు చేశారు. అనంతర విచారణ, దర్యాప్తులో నిందితుడిగా రుజువయ్యాడు. దాంతో, నిన్న (మంగళవారం) అదనపు సెషన్స్ జడ్జి డీఎన్ మిశ్రా, బాధితులను కిడ్నాప్ చేసేందుకు పన్నిన నేరపూరిత కుట్రలో యువకుడికి సంబంధం ఉందని రుజువవడంతో జీవితకాల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాలన్నింటిని ప్రాసిక్యూషన్ లాయర్ రవీంద్ర గౌడ్ మీడియాకు వివరించారు.

  • Loading...

More Telugu News