: మాజీ మంత్రిగారి గేదెలు విక్టోరియా మహారాణి కంటే ఫేమస్!
యూపీ మంత్రి అజం ఖాన్ కి చెందిన గేదెలు ఇటీవల కనిపించకుండా పోవడం, తత్ఫలితంగా ముగ్గురు పోలీసులకు ఉద్యోగాలు ఊడిపోవడం తెలిసిందే. అత్యున్నత స్థాయిలో పోలీసు బృందాలు వేట సాగించి పోయిన గేదెలను ఎట్టకేలకు దొరకబుచ్చుకున్నాయి. ఉగ్రవాదులను వేటాడిన తరహాలో సీనియర్ పోలీసు అధికారులు, స్నిఫర్ డాగ్స్ తో జరిపిన ఈ సెర్చ్ ప్రోగ్రామ్ ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. ఈ విషయమై నేడు మంత్రి అజం ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, గేదెలు కనిపించకుండా పోయిన రోజున ఏ టీవీ ఆన్ చేసినా, తన గేదెలు గురించే వార్తలుండేవని.. ఇప్పుడవి విక్టోరియా మహారాణి కంటే ప్రసిద్ధికెక్కాయని సంబరపడిపోయారు. తన పశువుల్లాగానే, తానూ అదృష్టవంతుణ్ణని ఇప్పుడందరూ కొనియాడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.