: కాటికాపరి వేషం వేసిన టీడీపీ ఎంపీ
టీడీపీ ఎంపీ శివప్రసాద్ సినీ కళాకారుడన్న సంగతి తెలిసిందే. ఆయన తనలోని కళను వర్తమాన రాజకీయాలకు ఆపాదిస్తూ వినూత్న వేషాల్లో నిరసన వ్యక్తం చేస్తుంటారు. కొద్ది కాలంగా నలుగుతున్న తెలంగాణ అంశంపైనా ఈ చిత్తూరు ఎంపీ ఇదే బాణీ అనుసరిస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో కాటికాపరి వేషం వేసి సోనియాకు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే యత్నాలు కట్టిపెట్టకపోతే ఐదు కోట్ల మంది ఉసురు తగలక తప్పదని శాపనార్థాలు పెట్టారు. తాము ఇప్పటివరకు సామ,దాన, భేద ఉపాయాలను ప్రయోగించామని.. ఇకపై చివరిదైన దండోపాయాన్నీ ప్రయోగించక తప్పడంలేదని శివప్రసాద్ వివరించారు.