: 7న లోక్ సభకు తెలంగాణ బిల్లు?
లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈ నెల 7న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 21 వరకు జరుగనున్నాయి. తెలంగాణ బిల్లుతో పాటు అవినీతి నిరోధక బిల్లులు ఆరు ఉండగా, మహిళా బిల్లు, మత హింస నిరోధక బిల్లు వంటి వాటిని పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం కేవలం తెలంగాణ బిల్లుపైనే అడ్డగోలుగా ముందుకు వెళ్తోందని సీమాంధ్రనేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ప్రధాని సహా కేంద్ర మంత్రులంతా తెలంగాణపై విస్తృత సంప్రదింపులు జరిపామంటున్నారు. ప్రతిపక్షాలు సహా అధికార పక్షం నేతలు కూడా కేంద్రం తమను సంప్రదించలేదని, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో ప్రతిపక్షాలు, మద్దతు తెలుపుతున్న పార్టీలు తెలంగాణ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బిల్లు ఎన్ని మలుపులు తిరగనుందో చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.