: ఒక్క నెల పాలనలో 15 వివాదాలు.. ఏఏపీ తీరు వివాదాలమయం!
‘అవినీతిని అంతం చేయాలి, స్వచ్ఛమైన పాలనతో దేశరాజకీయాల్లో సమూల మార్పులు తీసుకురావాలి’ వంటి ఆశయాలతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ)కి పరిపాలనకు సమయం సరిపోవడం లేదని, వివాదాలు చక్కబెట్టుకోవడంతోనే సమయం సరిపోతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెల రోజుల పాలనలోనే ఆ పార్టీపై 15 వివాదాలు చుట్టుముట్టాయి. ఆఫ్రికా మహిళపై దాడి, కేరళ నర్సులపై వ్యాఖ్యలు, సానియా మీర్జా పెళ్లిపై వ్యాఖ్యలు వంటి వివాదాలు రోజుకొకటి చొప్పున ఏఏపీని చుట్టుముట్టాయి. మరోవైపు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు... ఒకటేవిటి... రోజుకో కొత్త వివాదంతో రాజకీయ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు ఏఏపీ నేతలు. దీంతో, ఏఏపీ పాలన కంటే వివాదాలకే ప్రాధాన్యతనిస్తున్నట్టు కన్పిస్తోందని ప్రతిపక్షాలు విమర్శల వాన కురిపిస్తున్నాయి.