: టెట్ వాయిదా పడే అవకాశం
ఈ నెల 9న జరుగనున్న టెట్ పరీక్ష వాయిదా వేసే అవకాశాన్ని విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏపీఎన్జీవోలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరీక్ష నిర్వహణ కష్టమవుతుందన్న ఉద్దేశంతో అధికారులు పరీక్షను వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఉద్యోగులు సమ్మెలో ఉంటే పరీక్ష జరిగే అవకాశం లేదని, పరీక్షను వాయిదా వేయకతప్పని పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. పరీక్ష నిర్వహించే తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.