: వెంకయ్యనాయుడు, సీఎం, చంద్రబాబు అందరూ యూటర్న్ తీసుకున్నారు: వీహెచ్
బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముగ్గురూ తెలంగాణ అంశంపై యూ టర్న్ తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రులకు ఎంత కావాలంటే అంత తీసుకుని, వారి ప్రాంతానికి వెళ్లిపోవాలని సూచించారు. 1972లో వారు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేశారన్న ఆయన, 'ఇప్పుడు ఇస్తున్నాం వెళ్లిపోవాల'ని వీహెచ్ కోరారు. తెలంగాణకు అడ్డుపడకూడదని సీమాంధ్ర నేతలకు వీహెచ్ హితవు పలికారు.