: శక్తిస్థల్ నుంచి జంతర్ మంతర్ కు దీక్ష వేదిక మార్పు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు ఢిల్లీలో చేపట్టనున్న మౌనదీక్ష వేదిక మారింది. ఇందిరాగాంధీ స్మారక చిహ్నం శక్తిస్థల్ వద్ద మౌనదీక్ష చేపట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి వ్యతిరేక సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని భావించి మౌనదీక్ష వేదికను మార్చారు. దీంతో రేపు సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చేపట్టనున్న మౌనదీక్ష జంతర్ మంతర్ వద్ద జరుగనుంది.