: త్వరలో తటస్థ వేదికపై దాయాదుల క్రికెట్
భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు మైదానంలో తలపడితే వీక్షకులకు మస్త్ మజా, అటు స్పాన్సర్లకు కాసుల పంట. చాన్నాళ్ళుగా ఇరు జట్లు పరస్పరం ఓ మ్యాచ్ ఆడిందిలేదు. దీంతో, త్వరలోనే ఓ సిరీస్ ఏర్పాటు చేయాలని పీసీబీ, బీసీసీఐలు నిర్ణయించాయి. ఈ మేరకు పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జకా అష్రఫ్ మీడియాకు వివరాలు తెలిపారు. లాహోర్లో ఆయన మాట్లాడుతూ, సిరీస్ కు బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇటీవలే అష్రఫ్, శ్రీనివాసన్ లు భేటీ అయ్యారు. తమ సమావేశం సందర్భంగా ఇరు జట్ల మధ్య సిరీస్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామని అష్రఫ్ వెల్లడించారు. ఈ సిరీస్ తటస్థ వేదికపై జరుగుతుందని.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఏదో ఒకటి ఆతిథ్యం ఇస్తుందని తెలిపారు. మ్యాచ్ షెడ్యూల్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.