: ఆమ్ ఆద్మీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: అరుణ్ జైట్లీ


భారతీయ జనతా పార్టీపై ఆమ్ ఆద్మీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కమలం పార్టీపై ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలను లోబరుచుకునేందుకు జైట్లీ యత్నిస్తున్నారంటూ ఢిల్లీలోని ఆయన నివాసం ఎదుట ఈ ఉదయం ఏఏపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జైట్లీ స్పందిస్తూ.. ఎన్నికల ముందు చేసిన ఫోన్ కాల్ ఆధారంగా అసత్యాలు ప్రచారం చేస్తూ ఆందోళన చేయడం సరికాదన్నారు.

  • Loading...

More Telugu News