: ఈఆర్సీ బహిరంగ విచారణ ఉద్రిక్తం


విద్యుత్ ఛార్జీల పెంపుపై శాస్త్రి భవన్లో నిర్వహించిన ఈఆర్సీ బహిరంగ విచారణ ఉద్రిక్తంగా మారింది. వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను భద్రతా సిబ్బంది బహిరంగ విచారణకు అనుమతించలేదు. దీంతో వామపక్ష పార్టీల నేతలు సీపీఐ నారాయణ, సీపీఎం రాఘవులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రైవేటు కంపెనీలకు కొమ్ముకాసే విధంగా అధికారుల తీరు ఉందని... జీవీకే, ల్యాంకో, జీఎంఆర్ వంటి సంస్థలకు ప్రయోజనాలు కల్పించే దిశగా విచారణ చేస్తున్నారని ఆరోపిస్తూ విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వామపక్ష నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News