: కెనడాలో గ్యాంగ్ స్టర్ ను హత్య చేసిన ఎన్నారై అరెస్టు
విదేశాల్లో భారతీయులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నిన్న మొన్నటి వరకు శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే పేరు మోసిన భారతీయ సంతతి వ్యక్తులు తాజాగా రౌడీయిజంలో కూడా పేరు సంపాదించుకుంటున్న ఘటన చోటు చేసుకుంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో పేరుమోసిన గ్యాంగ్ స్టర్ మాథ్యూ కాంప్ బెల్ ను భారతీయ సంతతికి చెందిన జిమి సంధూ హత్య చేశాడు. మాథ్యూ క్యాంప్ బెల్ రెడ్ స్కార్పియన్స్ అనే గ్యాంగ్ కు నేతృత్వం వహిస్తున్నాడు. జిమిని అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచనున్నామని పోలీసులు తెలిపారు. జిమి సంధూపై ఇదివరకే బోలెడు నేరాభియోగాలున్నాయని కూడా పోలీసులు చెబుతున్నారు.