: కో-ఎడ్ స్కూళ్లే బెస్టు
కో-ఎడ్యుకేషన్ స్కూళ్లే విద్యకు మంచి వేదికలని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. కో-ఎడ్యుకేషన్ పాఠశాలలో చదువుకునే వారితో పోలిస్తే ప్రత్యేక పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా నేర్చుకునేదేమీ ఉండదని పరిశోధనల్లో తేలింది. విద్యాభ్యాసం మొదలు అన్ని విషయాల్లోనూ కో-ఎడ్యుకేషన్ స్కూళ్ల విద్యార్థులే ముందంజలో ఉన్నారని సదరు పరిశోధన ఫలితాలు వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 21 దేశాల్లో 16 లక్షల మంది విద్యార్ధులపై 184 పరిశోధనలు నిర్వహించి ఓ నివేదిక రూపొందించారు. ఈ పరిశోధనల్లో ప్రత్యేక పాఠశాలలు, కో ఎడ్యుకేషన్ పాఠశాలల్లో గణితం, సైన్స్ ఇతర సబ్జెక్టుల్లో ప్రతిభ, దృక్పధం, చొరవ తదితర అంశాలను పరిశీలించారు. ఈ నివేదికను అమెరికా సైకలాజికల్ అసోసియేషన్ జర్నల్ బులెటిన్ లో ప్రచురించారు.