: బిల్లు రాకుండా అడ్డుకోవాలని కొందరు యత్నిస్తున్నారు: సురవరం


పార్లమెంటు సమావేశాలను అడ్డుకుని తెలంగాణ బిల్లు రాకుండా చూడాలని కొందరు యత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే, ఈ ప్రయత్నాలను తిప్పికొట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు. ఈ బిల్లుకు ఆమోదం లభించేలా కాంగ్రెస్, బీజేపీయే చర్యలు చేపట్టాలన్నారు. మూజువాణి ఓటుతో నెగ్గిన శాసనసభ తీర్మానానికి విలువ లేదన్న సురవరం, ఆర్థిక బిల్లు తర్వాత రెండో బిల్లుగా తెలంగాణ బిల్లును ప్రతిపాదిస్తున్నామని అన్నారు. రాష్ట్ర సమైక్యత తప్ప మిగతా అంశాలపై సీమాంధ్రులకు సీపీఐ న్యాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News