: ఆట చూస్తూ 5 కోట్ల కేసుల బీర్లు తాగేశారు
భారత, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే దానికి ఎంతో క్రేజ్.. రెండు దేశాల జట్లు శత్రువులుగా భావిస్తాయి కనుక అభిమానుల్లో కూడా అదే భావం ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలోనే కాకుండా, ఇళ్లలో కూడా తీవ్ర ఉద్వేగాలు రాజ్యమేలుతుంటాయి. అలాంటి సన్నివేశమే అమెరికాలోనూ రాజ్యమేలింది. ఆ దేశంలో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ 'సూపర్ బౌల్'. దీని కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అమెరికా స్టైల్ లో జరిగే ఫుట్ బాల్ మ్యాచులనే 'సూపర్ బౌల్' అంటారు.
ఈ ఫుట్ బాల్ మ్యాచుల్లో ఆడే ఆటగాళ్లు హెల్మెట్, షోల్డర్ ప్యాడ్లు ధరించి కోడిగుడ్డు ఆకారంలో ఉండే బంతితో ఆడతారు. చూడడానికి రగ్బీలా ఉండే ఫుట్ బాల్. న్యూజెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియంలో జరిగింది. దీనికి ముందు ఫుట్ బాల్ ఆడుతున్నట్టున్న ఒబామా ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ మ్యాచ్ కి ఎక్కడలేని క్రేజు వచ్చేసింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు అభిమానులు పండగ చేసుకున్నారు. ఏకంగా 5 కోట్ల కోసుల బీర్లు తాగేశారు. ఆటను చూస్తూ అభిమానులు.. అదే స్థాయిలో చికెన్ కూడా లాగించేశారు.