: పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం లేదు: సుష్మాస్వరాజ్
పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం లేదని బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ అనుకూల, వ్యతిరేక ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందని అన్నారు. కేంద్రం పంపిన బిల్లును ముఖ్యమంత్రి తిప్పి పంపారని ఆమె గుర్తు చేశారు. అలాంటి బిల్లును పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎంపైనే ఆ పార్టీకి పట్టులేదని ఆమె ఎద్దేవా చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.