: రవాణా శాఖ సూపరింటెండెంట్ సునీతపై సస్పెన్షన్ వేటు
రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ)లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సునీత సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు బస్సులకు ఆమె అనుమతులు మంజూరు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) సన్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. సునీతతో పాటు జూనియర్ అసిస్టెంట్ పవన్ కుమార్ ను కూడా సస్పెండ్ చేశారు.