: భారత్ వెళ్ళే తమ దేశ మహిళలకు బ్రిటన్ జాగ్రత్తలు


ఒకప్పుడు మహిళలకు ఎంతో గౌరవ మర్యాదలిచ్చి ప్రపంచ దేశాలలో ఘనకీర్తిని చాటుకున్న మనదేశం... ఇప్పుడు అదే మహిళల విషయంలో చెడుకీర్తిని మూటకట్టుకుంటోంది. మనవాళ్లు ... పరాయివాళ్లు అన్న బేధం లేకుండా రెచ్చిపోతున్న మన 'మృగాళ్ల' పేరు చెబితే ... విదేశీయులు కూడా బెంబేలెత్తిపోతున్నారు.

భారదేశం అత్యాచారాలకు అడ్డాగా మారిందని, మహిళలకు రక్షణ లేదనీ, కాబట్టి భారత్ వెళ్ళే వారు జాగ్రత్తగా ఉండాలనీ తాజాగా బ్రిటన్ తన దేశ మహిళలను హెచ్చరించింది. భారత్ వెళ్ళేవారు అక్కడి బీచ్ లు, నిర్జన ప్రదేశాలలో సాధ్యమైనంతవరకు సంచరించకుండా వుంటే మంచిదని బ్రిటన్ ఉన్నతాధికారి తమ దేశ మహిళలకు సలహా ఇచ్చారు.          

  • Loading...

More Telugu News