: విశాఖ అరకు కెనరా బ్యాంకులో చోరీ
విశాఖజిల్లా అరకు కెనరా బ్యాంకులో చోరీ జరిగింది. దుండగులు బ్యాంకు ఏటీఎంను ధ్వంసంచేసి సొమ్మును దొంగిలించినట్లు తెలుస్తోంది. ఘటనపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బ్యాంకు, ఏటీఎం చోరీపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే, దొంగిలించబడిన నగదు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.