: ఆ మూడు బ్యాంకుల్లో ఆర్ బీఐ తనిఖీలు
మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్న ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. ఈ మూడు బ్యాంకుల ప్రధాన కార్యాలయాలతో పాటు బ్రాంచి కార్యాలయాల్లోనూ రిజర్వ్ బ్యాంకు తనిఖీలు చేస్తోంది. కాగా, ఈ వ్యవహారంలో తుది నివేదికను ఈ నెలాఖరులోగా సమర్పించాలని ఆ మూడు బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది.
ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండానే నల్ల ధనాన్ని ఖాతాల్లో జమ చేసుకునేందుకు ఆ మూడు బ్యాంకుల సిబ్బంది అనుమతిస్తున్నట్టు కోబ్రాపోస్ట్ అనే వెబ్ మ్యాగజైన్ స్టింగ్ ఆపరేషన్ లో బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంకు వెంటనే స్పందించి విచారణ షురూ చేసింది.