: నాకెవరి ప్రచారం అవసరం లేదు.. జగన్ ఆశీస్సులు చాలు: కొడాలి నాని


జూనియర్ ఎన్టీఆర్ ఆప్తుడు, వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని ఈ రోజు గుడివాడలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వార్తా చానల్ తో మాట్లాడుతూ, తన ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిన అవసరం లేదని... జగన్ ఆశీస్సులు ఉంటే చాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ టీడీపీ తరఫునే ఉంటానని ఇప్పటికే వెల్లడించిన సంగతి గుర్తు చేశారు. గుడివాడ నుంచి బాలకృష్ణ పోటీ చేసినా వెనక్కి తగ్గేది లేదని... ఇక్కడ వైకాపానే గెలుస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News