: వైఎస్సార్సీపీతో పొత్తుపై పునరాలోచనలో సీపీఎం?


వైఎస్సార్సీపీతో సీపీఎం పొత్తుకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైకాపాతో పొత్తు పెట్టుకుంటే... భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే దిశగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. సీపీఎంకు తెలంగాణ ప్రాంతంలో కొంత వరకు పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉనికి కోల్పోయిన వైకాపాతో కలసి పనిచేస్తే పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గం భావిస్తోంది. అయితే ఈ వివరాలను పార్టీ నాయకులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ఈ రోజు ఈ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News