: ముక్కలు చేసుకుంటూ పోతే, భారతదేశం ఎన్ని ముక్కలు కావాలి?: సుజనా చౌదరి


రకరకాల కారణాలతో రాష్ట్రాలను ముక్కలు చేసుకుంటూ పోతే భారతదేశాన్ని ఎన్ని ముక్కలు చేయాలని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదట ఏర్పడిందని, అలాంటి రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. బాషా ప్రాతిపదికన ఏర్పడిన తెలుగు జాతి ముక్కలు కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు పార్లమెంటులో పోరాడినట్టే, తెలుగు ప్రజల ప్రయోజనం కోసం అవిశ్రాంతంగా పని చేస్తామని సుజనా చౌదరి తెలిపారు.

  • Loading...

More Telugu News