: ఢిల్లీలో సీఎం దీక్ష పరిశీలనలో ఉంది: సి.రామచంద్రయ్య


ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేపట్టే అంశం పరిశీలనలో ఉందని మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. కాగా, ఈ నెల 4, 5 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరామని చెప్పారు. బిల్లును పార్లమెంటుకు పంపొద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తామన్న మంత్రి, ఆయన ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తారన్నారు. బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం తర్వాత న్యాయపరమైన అంశాలపై చర్చిస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఇతర పార్టీల నేతలు కూడా తమతో కలసి రావాలని కోరారు.

  • Loading...

More Telugu News