: 4న ప్రధానితో కేసీఆర్ సమావేశం
రాష్ట్ర విభజన బిల్లు ఢిల్లీకి వస్తున్నందున టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ నేతలతో కలిసి నిన్న రాత్రి ఆయన ఢిల్లీకి వచ్చారు. 4న ఉదయం 10 గంటలకు ప్రధాని మన్మోహన్ సింగ్ తో అపాయింట్ మెంట్ ఖరారైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తదితరులను కూడా కేసీఆర్ కలవనున్నారు. విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు.